E.G: ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు కొవ్వూరు డిపో మేనేజర్ ఎంఏ నాయక్ బుధవారం తెలిపారు. 10 కిలోమీటర్ల పరిధిలో 50 కిలోల లోపు పార్శిళ్లను 24 నుంచి 48 గంటల్లోపు డోర్ డెలివరీ చేస్తామన్నారు. ఈ నెల 20 నుంచి నెలరోజుల పాటు కార్గో మాసోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.మొబైల్ ట్రాకింగ్ ద్వారా పార్శిల్ ఎక్కడుందో తెలుసుకునే సౌకర్యం ఉందని పేర్కొన్నారు.