ADB: విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిదని ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు. బేల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.