కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో దోమల నివారణకు ఈరోజు పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.గ్రామంలో దోమల పెరుగుదల నివారించేందుకు అబేట్ దోమల మందు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ దోమల నివారణ చర్యలతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై నియంత్రణకు కృషి చేస్తున్నామని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ తెలిపారు.