నిడదవోలు మం. మునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మునపల్లి గ్రామానికి చెందిన అత్తిలి భరత్ (6) న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం సాయంత్రం బిర్యానీ తీసుకొచ్చేందుకు ద్విచక్ర వాహనంపై కానూరు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మునిపల్లిలోని రామాలయం వద్ద కానూరు నుంచి డి.ముప్పవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో భరత్ లారీ చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువుల రోదనలతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది.
Tags :