BHNG: బీబీనగర్ మండలం రాఘవపురంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా అధికారులకు గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గం అనుమతులు లేకుండా గ్రామంలో ఎలాంటి మట్టి తవ్వకాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.