GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. చింతలపూడిలోని తన స్వగృహంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి సంబరాలు చేశారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండి అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు. నియోజవర్గంలోని వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.