HNK: భీమదేవరపల్లి మండలంలోని వీరభద్ర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని ఇవాళ ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. దాదాపు ఐదు నెలల 15 రోజుల హుండీ కానుకల నుంచి మొత్తం రూ. 8,68,742 వచ్చినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు. ఈ మొత్తాన్ని యూనియన్ బ్యాంకులో జమ చేశారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ హనుమకొండ డివిజన్ పరిశీలకుడు అనిల్ పాల్గొన్నారు.