రష్యాలోని ఖేర్సన్ రీజియన్‌లో ఒక కేఫ్ అండ్ హోటల్‌పై ఉక్రెయిన్ దళాలు డ్రోన్‌తో దాడి చేశాయి. ఈ ఘటనలో 24 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు సమాచారం. పౌరులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుండగా ఈ దాడి జరిగినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంతో, రష్యా ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.