MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఓటరు జాబితా డ్రాఫ్ట్ విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026 సాధారణ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు సంబంధించిన ఓటరు జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అధికారులకు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ సూచించారు.