కృష్ణా: పెడన 10వ వార్డులో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక, పెడన వైసీపీ ఇంఛార్జ్ ఉప్పాల రాము గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.