E.G: సీతానగరం(మం) వేదులపల్లి గురువారం సినిమా షూటింగ్‌తో వాతావరణం సందడిగా మారింది. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, పల్లెటూరి వాతావరణం మధ్య సాగుతున్న చిత్రీకరణను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. తమ ఊరు మరోసారి వెండితెరపై కనిపించబోతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ నేపథ్యంలో గ్రామంలో కోలాహలం నెలకొంది.