BDK: అశ్వారావుపేట మండలం దిబ్బగూడెం గ్రామ పంచాయతీలో నూతన సంవత్సరం సందర్భంగా గిరిజన వృద్ధులకు దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమం బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో జరగడం విశేషం. చలికాలంలో వృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తించి వారికి అవసరమైన దుప్పట్లు అందించి మానవీయ విలువలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు.