TG: CWCకి BRS ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇచ్చినప్పుడు ప్రాజెక్టు ఖర్చు రూ. 55వేల కోట్లు చూపించిందని మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించారు. ‘DPRలో ఆయకట్టు కాల్వల ఖర్చు గురించి వివరాలు లేవు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసింది. తట్టెడు మట్టి తవ్వలేదని బీఆర్ఎస్ మాపై దుష్ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు.