GDWL: గద్వాల ఎస్పీ శ్రీనివాసరావుకు సీనియర్ ఐపీఎస్‌గా పదోన్నతి లభించింది. తెలంగాణ 2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన గద్వాల ఎస్పీగా విధులు నిర్వహిస్తూ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి పొందారు. పదోన్నతి నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. నేటి నుంచి ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో కొనసాగనున్నారు.