TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015 జూన్ 10నాడే జీవో ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘అప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35వేల కోట్లుగా చెప్పారు. రూ. 27 వేల కోట్లను BRS ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ ఒక్కఎకరాకు నీళ్లు రాలేదు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80వేల కోట్లకుపైగా కావాలి. జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత CWCకి DPR ఇచ్చారు’ అని పేర్కొన్నారు.