NRML: పోలీసులు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో ఎస్పీ పాల్గొని కేక్ కట్ చేసి సిబ్బందికి స్వీట్లు పంచారు. గత ఏడాది పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసి ప్రజల విశ్వాసం, మన్ననలు పొందిందని ఆమె తెలిపారు.