అనంతపురం టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పూల బొకేలు, గజమాలలతో ఎమ్మెల్యేపై అభిమానం చాటుకున్నారు. శ్రీనగర్ కాలనీ జై దగ్గుపాటి నినాదాలతో మారుమ్రోగింది. వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.