AP: పారా మెడికల్ కోర్సు విద్యార్థులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తొలిసారిగా సప్టిమెంటరీ పరీక్షలను నిర్వహించబోతోంది. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు విద్యార్థులు నష్టపోకుండా ఉండేలా 2025-26 విద్యా సంవత్సరం నుంచి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఫెయిలైన విద్యార్థులు ఈనెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించి.. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.