తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి 3 రోజులుు ఈ-డిప్ దర్శన టోకెన్లు కలిగిన భక్తులను అనుమతించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి సాయంత్రం 5 గంటల వరకు 40,008 మంది భక్తులుు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటివరకు 1,77,337 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్ల పేర్కొంది.