GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ VC కంచర్ల గంగాధరరావు నూతన సంవత్సరం సందర్భంగా కేకును కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మూడు క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో యూనివర్సిటీ రెక్టార్ శివరాం ప్రసాద్, రిజిస్టార్ సింహాచలం, వివిధ విభాగాల అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.