తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉమ్మడి భాగస్వామ్యం నుంచి టాటా గ్రూపు పూర్తిగా తప్పుకుంది. తాజ్ జేవీకేలో తనకున్న 25.52% వాటాను ప్రమోటర్ గ్రూపునకు చెందిన షాలినీ భూపాల్‌కు విక్రయించింది. 1.60 కోట్ల షేర్లను, ఒక్కోటి రూ.370 ధరతో, మొత్తం రూ.592 కోట్లకు విక్రయించింది. దీంతో తాజ్ జీవీకేలో తాజ్ అనే పేరును తొలగించనుంది.