SRPT: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు చేరేలా ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు.