PDPL: మంథని మండలంలోని ఖానాపూర్ ఖాన్ గ్రామాల శివారులోని ముసళ్ళ అభయారణ్యం ఎల్మడుగులో గురువారం అరుదైన సముద్రపు చేప లభ్యమయింది. ఇది నాలుగున్నర కిలోల బరువు ఉందని, దీని పేరు శీతల్ అంటారని స్థానికులు తెలిపారు. ఈ చేప వాలుగ చేప రూపాన్ని సంతరించుకుని ఉన్నప్పుటికీ, ఈ ప్రాంతంలో ఇలాంటి చేపల లభ్యం కావడం ఇదే మొదటిసారని అక్కడివారు తెలిపారు.