ASR: అరకులోయ మండలం, మారుమూల గిరిజన గ్రామమైన లోతేరు లో SI జీ గోపాలరావు ఆధ్వర్యంలో పోలీసులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరిపారు. ఈ మేరకు ఆయన కేక్ కట్ చేసి, గ్రామస్తులకు స్వీట్లు పంచిపెట్టారు. నూతన ఏడాది ప్రజలందరికీ కలిసొచ్చి, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోలీస్ అధికారులు తమ గ్రామంలో తమతో వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.