తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ అర్ధరాత్రి నుంచి టోకెన్లు లేనివారిని కూడా వైకుంఠ ద్వారదర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో.. ముందుగానే భక్తులు తిరుమల బాట పట్టారు. అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో TTD, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లతో పాటు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.