NGKL: పట్టణంలోని ఎంబీ చర్చి పాస్టర్‌గా సేవలందిస్తున్న రిటైర్డ్ టీచర్ కేవీ పురుషోత్తం(76) మృతిచెందారు. విద్యారంగంలో అనేక సేవలందించిన ఆయన ఎంబీ ప్రాపర్టీ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించారు. చర్చి అభివృద్ధికి విశేష కృషిచేసిన పాస్టర్ మృతిపట్ల క్రిస్టియన్ సంఘం నేతలు సంతాపం ప్రకటించారు. పురుషోత్తం అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.