తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు హెచ్. వినోద్ ‘జన నాయగన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ ఈనెల 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 3న సాయంత్రం 6:45 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విజయ్‌కి ఇదే చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.