రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జలాల వాటాపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని BJLP నేత మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ప్రభుత్వం కృష్ణా జలాలు 299 టీఎంసీలపై సంతకం పెట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విరుచుకుపడ్డారు. తమకు ఏమి తెలియనట్లు మాజీ మంత్రి హరీష్రావు బనకచర్ల సమస్యను సభలో ప్రస్తావించి తప్పదోవ పట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు.