మద్యం తాగే ముందు రెండుమూడు చుక్కలను నేలపై చల్లడం చూస్తుంటాం. దిష్టి తగలకుండా అని, పెద్దలకోసం అని కొందరు చెబుతుంటారు. అయితే, గతంలో ఇంట్లో తయారుచేసిన మద్యం పరీక్షించేందుకు ఇలా చేసేవారని మరికొందరు అంటున్నారు. నేలపై లిక్కర్ చుక్కలు వేసినప్పుడు బుడగలు ఏర్పడితే స్ట్రాంగ్ ఉంటుందని అర్థమని చెప్పారు. రాజులపై విషప్రయోగం గురించి తెలుసుకోవడానికి గతంలో ఇలా చేసేవారని మరికొందరి మాట.