ASF: న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి నివాసం గురువారం సందడిగా మారింది. ఆమెను ఏరియా సింగరేణి GM విజయ్ భాస్కర్, అధికారులు, పలు మండలాలు, గ్రామాల నూతన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారందరిని MLA ఆత్మీయంగా పలకరించి, నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపునచ్చారు.