TG: ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్.. ఉమ్మడి ఏపీలో పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఏపీకి, తెలంగాణకి చెందిన వ్యక్తి కాదని.. బీహార్‌కు చెందిన వ్యక్తి అని స్పష్టం చేశారు. హరీష్ రావు దోపిడీ బయటపడుతుందని అధికారులను కూడా టార్గెట్ చేశారని మండిపడ్డారు. కాగా, ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు వ్యక్తి అని హరీష్ రావు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.