KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ వీసీ వెంకట బసవరాజును కోరారు. గురువారం వీసీని కలిసి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై చర్చించగా, పీడీఎస్యూ నాయకులు రమణకుమార్ తదితరులు పాల్గొని విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.