NRPT: పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. గురువారం నారాయణపేటలోని గురుకుల పాఠశాల సందర్శించి విద్యార్థినుల విద్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సిబ్బంది అదనపు కలెక్టర్‌ను ఘనంగా స్వాగతం పలికి పాఠశాల వివరాలు తెలియజేశారు.