MDK: కొల్చారం మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు నెక్లెస్, రూ.46 వేల నగదు, వెండి కడియాలు ఎత్తెకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.