WG: మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్ష, భారీ జరిమానాలు తప్పవని నరసాపురం శక్తి టీమ్ ఇంఛార్జ్ ఎస్సై జయలక్ష్మీ హెచ్చరించారు. డీఎస్పీ శ్రీవేద ఆదేశాలతో గురువారం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పట్టుబడిన మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాల బారిన పడేయవద్దని హెచ్చరించారు.