VZM: ఎస్కోటలోని స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉదయం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హులైన రైతులు హాజరు కావాలని కోరారు.