MLG: తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దు కర్రెగుట్టలపై పోలీసు బలగాలు మరోసారి పైచేయి సాధించారు. ఉసూర్ ప్రాంత పరిధిలోని కర్రెగుట్ట, డోలిగుట్ట శిఖర ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన భూమి తవ్వకాల్లో మావోయిస్టులు దాచి ఉంచిన ఆయుధ మరమ్మతు పరికరాలు, బీజీఎల్ సెల్ నిర్మాణ సామగ్రి, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు.