GDWL: అయిజ మండలం చిన్న తండ్రపాడు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఐజ–మేడకొండ చౌరస్తా సమీపంలో ఆయన మృతదేహం లభ్యం కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంజనేయులు మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.