ADB: రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు-2026లకు సంబందించిన స్టిక్కర్లు, పంప్లెట్స్, బ్యానర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.