VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న సింహాద్రినాథ నిత్య అన్నప్రసాద పథకానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడెం గ్రామానికి చెందిన బి. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి రూ.1 లక్ష విరాళం గురువారం అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా డిప్యూటీ ఈవో సింగం రాధకు చెక్కు అందించి, స్వామివారి ప్రత్యేక దర్శనం పొందారు.