AP: న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2020 జాతీయ విద్యా విధానం ద్వారా సౌకర్యాలతో పాటుగా నాణ్యమైన విద్యను సైతం అందించేందుకు సిద్ధమైంది. PM SHRI పథకం కింద రాష్ట్రంలోని 935 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది.