ఫాస్టాగ్ యూజర్లకు ఊరట కల్పిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు, జీప్‌లు, వ్యాన్లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికల్ ప్రక్రియను నిలుపుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని NHAI తెలిపింది. దీనివల్ల లక్షలాది మంది యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది.