KNR: హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో డిసెంబరు 31 రాత్రి పోలీసులు ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, సైదాపూర్, శంకరపట్నం మండలాల వ్యాప్తంగా మొత్తం 72 మంది పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.