AP: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ తాడిపత్రిలో ఏర్పాటు చేసిన ఒకరోజు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ప్రజలను మమేకం చేయడానికే తాను దీక్ష చేశానని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లు చెత్త తరలించకపోవడం వల్ల ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ ఆస్తులు, ఖర్చులు, వాహనాల గురించి ప్రజలకు చెప్పాలని దీక్ష చేసినట్లు చెప్పారు.