VSP: మధురవాడ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో జీవీఎంసీ కమిషనర్‌తో సమావేశం నిర్వహిస్తామన్నారు. గురువారం మధురవాడ జోనల్ కార్యాలయం ప్రారంభం అనంతరం మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం కోసం జోనల్ వ్యవస్థను విస్తరించామని, భీమిలి-మధురవాడలను వేర్వేరు జోన్లుగానే కొనసాగిస్తున్నామని చెప్పారు.