KMM: నగరంలో గురువారం దారుణ హత్య జరిగింది. స్థానిక బొక్కలగడ్డకు చెందిన మోటే రాములమ్మను మరిది కొడుకు శేఖర్ ఇంటిముందు మిరపకాయల తొడిమలు తీస్తుండగా కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై నిందితుడు కత్తితో దాడి చేయగా అతను కూడా గాయపడ్డాడు, అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.