NLG: చిట్యాల మండలం ఏపూరు గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గ్రామస్తులకు ఇచ్చిన హామీలను వేగంగా నెరవేరుస్తున్నారు. గ్రామస్తులకు ఉచితంగా నీటిని అందించేందుకు ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యంను గురువారం ప్రారంభించారు. అలాగే గ్రామంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.