KNR: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండలం కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు గురువారం పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడ్డారు.