MHBD: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని సచివాలయంలో ఇవాళ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంటా సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసముద్రం మండలంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.