E.G: ఖరీఫ్ 2025–26 సీజన్లో తూ.గో జిల్లాలో వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. ఈ సీజన్‌కు గాను జిల్లాలో మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా వేయగా.. జనవరి 1, 2026 నాటికి 3,67,852.240 మెట్రిక్ టన్నుల వరిని సేకరించామన్నారు.